క్రైమ్/లీగల్

కృష్ణా కరకట్ట అక్రమ కట్టడాల కేసులో ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 16: కృష్ణా కరకట్ట అక్రమ కట్టడాల వ్యవహారంలో చందన భవనానికి ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ సీఆర్‌డీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. కృష్ణా కరకట్ట ఆక్రమణలపై దృష్టి సారించిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఇక్కడి ప్రజావేదికను తొలిగించింది. ఇదే క్రమంలో మరికొన్ని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో చందన కేదారనాధ్‌కు చెందిన కట్టడానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు గతంలో మూడు వారాల స్టే విధించింది. దీంతో స్టే తొలిగించాలని ప్రభుత్వం తరుఫున సిఆర్‌డిఏ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం పిటిషన్ విచారణకు రాగా.. ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. విచారణ అనంతరం పిటిషన్‌పై తీర్పును న్యాయస్ధానం రిజర్వులో ఉంచింది. చందన కేదారీశ్వరరావు గెస్ట్‌హౌస్‌కు ఇచ్చిన మూడువారాల స్టేను నిలుపుదల చేయాలంటూ ఈ కట్టడానికి స్టే ఇస్తే మిగిలిన నిర్మాణాల యజమానులంతా అదే బాట పడతారని హైకోర్టు ఎదుట సిఆర్‌డిఏ వాదనలు వినిపించింది. అసలు తమకు నోటీసు ఇచ్చే అధికారమే సీఆర్‌డీఏకు లేదంటూ చందన కేదారీశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సిఆర్‌డిఏ యాక్టు నాలుగేళ్ల క్రితం మాత్రమే వచ్చిందని తాను భవనాన్ని ఇరవై ఏళ్ల క్రితమే కట్టానంటూ యజమాని పేర్కొన్నాడు. దీంతో నదీ గర్భంలో రివర్ కన్జర్వేషన్ యాక్టుకు వ్యతిరేకంగా భవనాన్ని నిర్మించారంటూ సిఆర్‌డిఏ తన వాదనల్లో పేర్కొంది. అది అక్రమ కట్టడమైతే అనుమతులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన భవన యజమాని తన భవనానికి అప్పట్లో ఉండవల్లి పంచాయితీ, ఇరిగేషన్ శాఖ అనుమతులిచ్చిందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న మీదట న్యాయస్ధానం తీర్పు రిజర్వులో ఉంచింది.