క్రైమ్/లీగల్

ఎందుకంత తొందర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య ఖ్యాతిని మట్టుపెట్టొద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ , జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన ప్రజావాజ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తొందరను తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల నిర్వహణకు ప్రజాస్వామ్య పద్ధతి అంటూ ఉంటుందని, దానిని మట్టుపెట్టొద్దని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ముందు చేపట్టాల్సిన వార్డులు, డివిజన్ల వర్గీకరణ అన్యాయంగా ఉందని, మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ నిర్మల్ పట్టణానికి చెందిన కే అంజన్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు స్వీకరించింది. పిటీషనర్ తరఫున చిన్నోల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 149 రోజుల వ్యవధి పడుతుందని ప్రభుత్వం పేర్కొందని, హైకోర్టు గతంలో 109 రోజుల వ్యవధిలో ఎన్నికలు పూర్తి చేయాలని సూచించిందని అయితే హడావుడిగా 30 రోజుల్లో పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని నరేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల పూర్వ ప్రక్రియకు చాలా వ్యవధి కావాలని గతంలో చెప్పిన ప్రభుత్వం 8 రోజుల్లోనే దానిని పూర్తి చేసిందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ హైజాక్ జరిగినట్టుందని, అదే జరిగితే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కోల్పోతారని అన్నారు. ప్రశాంతంగా స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి పెట్టింది పేరని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంత వరకూ ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి?? ఎన్ని పరిష్కరించారు అని ప్రధాన న్యాయమూర్తి అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావును ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావన తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ పిటిషన్ దాఖలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. ఎన్నికల పూర్వ ప్రక్రియను గతంలోనే ప్రభుత్వం పూర్తి చేసిందని, 132 మున్సిపాల్టీలలో 10 మున్సిపాల్టీల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఏఏజీ కోర్టుకు వివరించారు. నాలుగు రోజులు వ్యవధిలో అభ్యంతరాలు చెప్పుకోవాలని సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? వచ్చినవి ఒక్క రోజులోనే ఎలా పరిష్కరించారు అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ తరఫున జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే మున్సిపల్ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.