క్రైమ్/లీగల్

ఇద్దరు గిరిజనుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జి.మాడుగుల, జూలై 18: విశాఖ మన్యంలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఒకే సారి ఇద్దరు గిరిజనులను బుధవారం అర్ధరాత్రి హతమార్చగా, మరో గిరిజనుడికి దేహశుద్ధి చేసి కలకలం సృష్టించారు. చింతపల్లి మండలం కుడుమసార పంచాయతీ వీరవరం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన మన్యంలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం సాయుధులైన సుమారు 50 మంది మావోయిస్టులతో పాటు మరో 150 మంది మావోల సానుభూతిపరులు బుధవారం అర్ధరాత్రి పనె్నండున్నర గంటల సమయంలో వీరవరం గ్రామాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. గ్రామాన్ని చుట్టుముట్టిన మావోలు తమ ఇళ్లల్లో నిద్రిస్తున్న పాంగి సత్తిబాబు (45), గెమ్మెలి భాస్కరరావు (38), లింగబాబు అనే గిరిజనులను లేపి ఇళ్ల నుంచి బైటకు తీసుకువచ్చి, లింగబాబుకు దేహశుద్ధి చేసి హెచ్చరించి విడిచిపెట్టినట్టు తెలిసింది. అయితే సత్తిబాబు, భాస్కరరావులను మాత్రం వారి ఇళ్ల వాకిళ్లలోనే గొడ్డళ్లతో నరికి మావోలు దారుణంగా హత్య చేసారు. తమ నాయకుడు హత్యకు వీరిద్దరూ కారణమయినందునే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడి ప్రతీకారం తీర్చుకున్నట్టు తెలుస్తోంది. 2014వ సంవత్సరం అక్టోబర్ నెలలో చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంతలో మావోయిస్టు పార్టీ నాయకుడు శరత్‌పై గిరిజనులు దాడి చేసి హత్య చేసిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో గెమ్మెలి సంజీవరావు అనే గిరిజనుడిని అప్పటిలో మావోయిస్టులు కోరుకొండ వారపు సంతలో హత్య చేసారు. దీంతో సంజీవరావు భార్య తిలోత్తమ మావోయిస్టు నాయకుడు శరత్‌పై భౌతిక దాడికి పాల్పడగా, ఆమెతో పాటు వీరవరం గ్రామానికి చెందిన గిరిజనులు మావోయిస్టులపై దాడి చేసారు. ఈ సంఘటనలో మావోయిస్టు నాయకుడు శరత్‌తో పాటు మావోల సానుభూతిపరుడైన గణపతి మృతి చెందారు. అయితే తమ నాయకుడు శరత్‌ను హత్య చేసిన ఘటనలో పది మంది గిరిజనులను మావోలు హిట్‌లిస్టులో చేర్చారని, ఇందులో సత్తిబాబు, భాస్కరరావులను కీలకంగా పరిగణించినట్టు తెలుస్తోంది. తమ నాయకుడు శరత్‌ను హత్య చేయడంలో సత్తిబాబు, భాస్కరరావులే ప్రధాన పాత్ర పోషించారని అనుమానిస్తున్న మావోలు వీరి కోసం గత కొన్నాళ్లుగా అనే్వషిస్తున్నట్టు తెలిసింది. మావోల నుంచి తమకు ముప్పు ఉండడంతో గత కొన్నాళ్లుగా సత్తిబాబు, భాస్కరరావు గ్రామాన్ని విడిచి వేరే చోట తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరూ వీరవరం గ్రామానికి వెళ్లిపోయి జీవిస్తుండగా ప్రతికారంతో రగిలిపోతున్న మావోలు అదును చూసి వీరిని హతమార్చినట్టు తెలుస్తోంది. కాగా తమ వారిని మావోయిస్టులు హత్య చేసేందుకు మావోయిస్టులు పూనుకోవడంతో హతుల కుటుంభ సభ్యులు అడ్డుకుని ప్రాధేయపడినప్పటికీ మావోలు పట్టించుకోకుండా దారుణంగా హత్య చేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉండగా ఇద్దరు గిరిజనుల హత్య అనంతరం వీరవరం గ్రామంలో మావోయిస్టులు వాల్‌పోస్టర్లను అంటించారు. తమ నాయకులు శరత్, గణపతిలను చంపినందుకే ఖతం చేయక తప్పలేదని, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మిగిలిన గిరిజనులు కూడా ప్రజాకోర్టులో లొంగిపోయి తమ తప్పును ఒప్పుకుని సాధారణ జీవితాన్ని గడపాలని, గిరిజనుల హత్యకు పోలీసులే బాధ్యత వహించాలంటూ వాల్‌పోస్టర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ సంఘటన విశాఖ మన్యంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసు వర్గాలను కలవరానికి గురిచేసింది.