క్రైమ్/లీగల్

రాళ్లు, కొడవళ్లతో దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, టంగుటూరు, జూలై 19: ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం టంగుటూరు మండలం పొందూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మక్కపాలెంలో శుక్రవారం తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల మధ్య కొడవళ్లు, రాళ్లతో దాడులు జరిగాయి. ఈ దాడిలో టీడీపీకి చెందిన ఉప్పుటూరి సుబ్బారాయుడుకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మక్కపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉప్పుటూరి సుబ్బారాయుడు వైసీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో అదే గ్రామానికి చెందిన నరసింహారావు, సుధీర్‌తోపాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు కొడవళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో నరసింహారావు అనే వ్యక్తి సుబ్బారాయుడు నోటిపై రాయితో గట్టిగా కొట్టడటంతో ఒక పన్నుకూడా విరిగింది. గాయపడిన సుబ్బరాయుడుని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన మద్దినేని సుజాత ఇంటి వద్ద ఉండగా, ఆ గ్రామంలోని టీడీపీకి చెందిన శ్రీనివాసులు, ప్రవీణ్ మరికొంతమంది ఆమెను దూషించారు. ఎందుకు తిడుతున్నారని సుజాత అడగగా, ఆమెపైనే కాకుండా ఆమె భర్త, కుమారుడిపై దాడి చేశారు. దీనిపై సుజాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టంగుటూరు ఎస్‌ఐ వై రమణయ్య తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన రెండు ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఇదిలాఉండగా ఒంగోలు రిమ్స్‌లో చికిత్సపొందుతున్న టీడీపీ కార్యకర్త ఉప్పుటూరి సుబ్బరాయుడును రాష్ట్ర మాజీ మంత్రులు, త్రిమెన్ కమిటీ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొత్తపల్లి జవహర్, శిద్దా రాఘవరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు దామచర్ల జనార్ధన్ తదితరులు పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. హత్యారాజకీయాలకు వైకాపా నేతలు పాల్పడటం మంచిది కాదని హితవుపలికారు. కేవలం ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే లక్ష్మక్కపాలెంలో తమపార్టీకార్యకర్తపై రాళ్లు, కొడవళ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పరిణామాలు ఏ పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి హత్యా రాజకీయాలకు పుల్‌స్టాప్‌పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇవే పరిణామాలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకోవాలే తప్ప ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత నీచరాజకీయాలకు పాల్పడటం మంచిదికాదన్నారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ బృందం వైద్యాధికారులతో మాట్లాడి నాణ్యమైన వైద్యచికిత్సలను బాధితునికి అందించాలని సూచించారు.