క్రైమ్/లీగల్

మున్సిపోల్స్‌కు చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు న్యాయపరమైన సమస్యలు ఎదురౌతున్నాయి. ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని, వార్డుల పునర్విభజన కార్యక్రమం సజావుగా జరగలేదని మండిపడింది. ఎన్నికల ముందు అత్యంత జాగ్రత్తగా, తప్పులు లేకుండా రూపొందించాల్సిన ఓటర్ల జాబితా, స్పష్టంగా ఉండేలా వార్డుల విభజన చేయడం తదితర కార్యక్రమాలను చేపట్టడంలో ప్రభుత్వం హడావుడి పడటం ఏమిటని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించింది. ఇవే కారణాలపై భైంసా, మిర్యాలగూడ, శంషాబాద్, కరీంనగర్ తదితర తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగకుండా స్టే ఇచ్చింది. మరికొన్ని మున్సిపాలిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి. వీటిని కూడా హైకోర్టు పరిశీలిస్తోంది. ఈ పరిస్థితిలో హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వ విధానంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల ముందు కార్యక్రమం
ఉండాలని కోర్టు స్పష్టం చేయడం ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినట్టయింది. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాపాడుతోందన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేయడం రాష్ట్రంలో అలజడి సృస్టిస్తోంది. ఈ నెల 22న హైకోర్టులో తదుపరి విచారణ జరుగుతుండటంతో, కోర్టుకు ఏఏ విషయాలు ఏ విధంగా నివేదించాలన్న అంశంపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమగ్ర నివేదికలను రూపొందించుకుంటున్నాయి. మున్సిపాలిటీల ఎన్నికలు ఐదు నెలల్లోగా పూర్తి చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. 2019 జూన్ 26న హైకోర్టు జడ్జి పీ. నవీన్ రావు ఆదేశాలు జారీ చేస్తూ, 119 రోజుల్లో ప్రభుత్వం ‘ప్రీ-పోల్’ పనులైన ఓటర్ల జాబితా రూపొందించడం, వార్డుల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ పనులన్నీ ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు 27 రోజుల గడువు ఇచ్చింది. వాస్తవంగా ప్రీపోల్ పనులకోసం 151 రోజుల సమయం కావాలని ప్రభుత్వ కోరగా, ఎన్నికల నిర్వహణకోసం 30 రోజుల గడువు కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది. ఇటు ప్రభుత్వానికి, అటు ఎన్నికల కమిషన్‌కు అవసరమైన సమయాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చారు. జూన్ 26 న కోర్టు ఉత్తర్వులు వెలువడగా, జూలై 15 వరకే అంటే 20 రోజుల వ్యవధిలో ఓటర్ల జాబితా రూపొందించడం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వార్డుల పునర్వ్యవస్థీకరణ తదితర పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ కారణంగానే హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా ప్రభుత్వం హడావుడి పడటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన గడువును ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుని తప్పులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదన్న కోర్టు అభిప్రాయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కోర్టులో ఈ నెల 22న కేసు విచారణకు వస్తుండంతో ఎన్నికల పరిస్థితి ఏమవుతుందన్న అంశం ప్రజల్లో చర్చనీయాంశం అయింది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, దోషాలు లేకుండా ప్రభుత్వం నివేదికలను రూపొందిస్తే బాగుండేదని హైకోర్టు సీనియర్ న్యాయవాది వి. హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, చట్టానికి లోబడి, నియమ నిబంధనలకు రోబడి, తప్పులు లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని పేర్కొన్నారు.