క్రైమ్/లీగల్

దవాఖాన నిర్లక్ష్యంపై సర్కారు కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఒక రోగి పట్ల నిర్లక్ష్యం చూపించిన దవాఖానా నుండి ఎనిమిది లక్షల రూపాయల పరిహారాన్ని పౌరసరఫరాల శాఖ వినియోగ సహాయ కేంద్రం అందించి ప్రజల్లో సహాయ కేంద్రం పట్ల నమ్మకం పెంచింది. పరిహారానికి సంబంధించిన చెక్కును బాధితుడికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం అందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిర్సిల్లా జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన పి. దేవయ్య (31) యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నారు. పైల్స్ వ్యాధికి గురి కావడంతో సికింద్రాబాద్‌లోని పైల్స్ క్లినిక్‌లో 2018 ఫిబ్రవరి 24 న 25 వేల రూపాయల ప్యాకేజీతో లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. ఈ ట్రీట్‌మెంట్ అయిన మూడు గంటల తర్వాత దేవయ్యను దవాఖానా యజమాన్యం డిస్చార్జ్ చేసింది. డిస్చార్జ్ అయిన తర్వాత రక్తస్రావం జరగడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ ట్రీట్‌మెంట్ చేసిన దవాఖానాకే మరుసటిరోజు వెళ్లారు. పరిస్థితి గమనించిన దవాఖానా యాజమాన్యం తదుపరి చికిత్స కోసం యశోదా ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. చికిత్సకోసం పెద్దమొత్తంలో డబ్బు అవసరం అవుతుందని యశోదా ఆసుపత్రివర్గాలు చెప్పడంతో సాయంకోసం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5.50 లక్షల రూపాయలు కేటీఆర్ ఇప్పించారు. మొత్తం వైద్య ఖర్చులు 18 లక్షల రూపాయలు కావడంతో మిగతా డబ్బుకోసం తనకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మివేసి, అప్పలుచేసి యశోదా ఆసుపత్రిలో బిల్లు చెల్లించారు. దేవయ్య తనకు తొలుత చికిత్స చేసిన దవాఖానా నిర్వహకుల వల్ల ఇబ్బందికి గురయ్యానని భావించి, ఆ దవాఖానాపై వినియోగదారుల సహాయ కేంద్రంలో 2019 జూన్ 29 న కేసు నమోదు చేశారు. దవాఖానా యాజమాన్యానికి నోటీసులు జారీచేసి 20 రోజుల్లో తీర్పు చెబుతూ 8 లక్షల రూపాయలు పరిహారం ఇప్పించారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ కేటీఆర్‌కు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.