క్రైమ్/లీగల్

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జూలై 22: చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను సోమవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుప్పం మండల పరిధిలోని సామగుట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హనుమప్ప కుమారుడితో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఇంటిలో దొంగనోట్లను ముద్రించే యంత్రంతో పాటు చలామణికి సిద్ధంగా ఉన్న సుమారు రూ.2 కోట్ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏయే ప్రాంతాల్లో వీరు దొంగనోట్లను చలామణి చేశారనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అరెస్ట్ చూపనున్నట్లు తెలిసింది.