క్రైమ్/లీగల్

గ్రూప్-2 ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 ఇంటర్వ్యూలకు లైన్ క్లియర్ అయ్యింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు యథావిథిగా కొనసాగనున్నాయి. గ్రూప్-2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు తగిన కారణాలు లేవని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగానే ఉన్నాయని , అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని పేర్కొంటూ ఈ సమస్యను ఇంతటితో ముగిద్దామని జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ -2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1032 పోస్టులకూ 2142 మంది అభ్యర్థులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 26తో ముగియనున్నాయి. జనరల్ అభ్యర్థులను ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థులను ఒక పోస్టుకు ఐదుగురు చొప్పున ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుతో సర్వీసు కమిషన్ తదుపరి చర్యలను చేపట్టనుంది.
ప్లానింగ్ పోస్టులకు తాజా జాబితా
మండల్ ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు సర్వీసు కమిషన్ తాజా జాబితాను ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ 3న నిర్వహించిన లిఖిత పరీక్ష ఆధారంగా 481 పోస్టులకు గానూ 473 పోస్టులను భర్తీ చేసింది. అయితే మిగిలిన పోస్టులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు పరిష్కారం కావడంతో అర్హులైన అభ్యర్ధుల జాబితాను ప్రకటించినట్టు సర్వీసు కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.