క్రైమ్/లీగల్

సమయం ఉంది కదా.. హడావుడి ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలుపుదల చేయాలని కే అంజుకుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం తన కౌంటర్‌ను జూలై 26లోగా దాఖలు చేయాలని ఆదేశించింది. కేసును జూలై 29న తుది విచారణ చేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఏ సంజీవ్‌కుమార్ మరికొంత వ్యవధి కావాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసినట్టుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికలను ఏదో తొందరపడి నిర్వహించాలని చూస్తోందని , అంత అవుసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. మరో పక్క సోమవారం నాడు వివిధ మున్సిపాల్టీల్లో ఎన్నికల నిలుపుదల
కోరుతూ 20వరకూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన జస్టిస్ పీ నవీన్‌రావు కొన్నింటిలో ఎన్నికలు నిలుపుదల చేస్తూ స్టే ఆదేశాలు జారీ చేశారు. గతవారం మొత్తం మీద హైకోర్టులో 60 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంత వరకూ 45 మున్సిపాల్టీల ఎన్నికలపై కోర్టు స్టే విధించింది.