క్రైమ్/లీగల్

‘జబర్దస్త్’ నటుడు వినోద్‌పై దాడి కేసులో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: జబర్దస్త్ టీవీ షో ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులపై కాచిగూడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
స్థలం కొనుగోలు సందర్భంగా శనివారం వివాదం జరగడంతో యజమాని కుటుంబ సభ్యులు దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని కాచిగూడ పొలీస్ స్టేషన్‌లో వినోద్ ఆదివారం ఫిర్యాదు చేశాడు.
దాడిలో వినోద్ ఎడమ కంటి భాగంపై దెబ్బలు తగిలాయి. తీవ్ర గాయాలపాలైన వినోద్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇసామియాబజార్‌లో నివసిస్తున్న బాలాజీ, ప్రమీల దంపతులతోపాటు వారి కుమారులు ఉదయ్‌సాగర్, అతడి భార్య సంధ్య, అభిషేక్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశామని కాచిగూడ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపారు.