క్రైమ్/లీగల్

భార్యను రాళ్లతో కొట్టి చంపిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, జూలై 22: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను రాళ్లతో కొట్టి చంపిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన తెలుగు రేణుక (25)ను ఆమె భర్త జలగం మధు (30) వ్యవసాయ పొలంలో రాళ్లతో కొట్టి చంపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తెలుగు రేణుక కేఎల్‌ఐ క్వార్టర్స్ ముందున్న వ్యవసాయ భూమిలో పని చేయడానికి వచ్చింది. ముందునుంచి భార్యపై అనుమానంతో ఉన్న ఆమె భర్త మధు ఆమె కూలి పనికి వెళ్లిన అరగంట తరువాత చేనువద్దకు వెళ్లాడు. చేనులో వేరే వ్యక్తితో రేణుక ఉండటాన్ని చూసి అక్కడే ఉన్న రాళ్లతో ఆమె తలపై తీవ్రంగా బాది మొహంపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన గురించి గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. నిందితుడు మధు పరారీలో ఉన్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.