క్రైమ్/లీగల్

వారసత్వ పరిరక్షణ చట్టంలో వైరుధ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత అంశంపై మంగళవారం నాడు హైకోర్టులో సుదీర్ఘవాదనలు జరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని వారసత్వ సంపదను ఏ చట్టం ద్వారా పరిరక్షిస్తున్నారో తేటతెల్లం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ వారసత్వ చట్టం సంరక్షణ, పరిరక్షణ, నిర్వహణ చట్టం ముసాయిదాలోని వైరుధ్యాలను హైకోర్టు మంగళవారం నాడు ఎత్తిచూపింది. ముసాయిదాను రూపొందించిన వారికి కనీసం ఆంగ్లం కూడా వచ్చినట్టు లేదని ధర్మాసనం పేర్కొంది. వారసత్వ చారిత్రక భవనాల రక్షణకు చట్టం లేదని ఒక పక్క చెబుతూనే మరో పక్క హెచ్‌ఎండీఏను ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని ప్రధాన న్యాయమూర్తి నిలదీశారు. రెగ్యులేషన్ 13 తొలంగింపులో ఏ విధానాన్ని అనుసరించిందో వివరించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు ప్రభుత్వ వాదనలను వినిపిస్తూ జనరల్ క్లాజెస్ యాక్టులోని సెక్షన్ 6 కొత్తగా రూపొందించిన 2017 చట్టానికి వర్తించదని అన్నారు. 2015లోనే రెగ్యులేషన్ 13ను తొలగించడమైందని ఏఏజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. చట్టంలోని వైరుధ్యాలు భయంకరంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారసత్వ చట్టం ప్రవేశికలోని అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. వారసత్వ సంపద పరిరక్షణకు హెచ్‌ఎండీఏ పరిధిలో చట్టం లేదని పేర్కొంటూ కొత్త చట్టాన్ని తీసుకురావడం , ఉన్న చట్టాన్ని కొత్త చట్టం పేరుతో రద్దు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి వాదనలను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. కాగా, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ సంస్థ తన కార్యకలాపాలను జూలై 25 నుండి ప్రారంభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం నాడు హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశారు. నిరవధికంగా మూసివేస్తున్నట్టు సంస్థ ప్రకటించడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డి సంస్థ వివరణ కోరగా, ఈ మేరకు సంస్థను తిరిగి తెరిచేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 29వ తేదీకి వాయిదా వేశారు.