క్రైమ్/లీగల్

తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మానవ హక్కుల కోర్టుల ఏర్పాటులో 2018 సంవత్సరం జనవరిలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయని ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. స్పందించని ఈ రాష్ట్రాలు లక్ష రూపాయిల వరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం సుప్రీం ఆదేశాలకు స్పందించడం కానీ.. కోర్టుకు హాజరు కావడం కానీ చేయలేదనీ.. ఈ దృష్ట్యా ఈ రెండు రాష్ట్రాలు లక్ష రూపాయిల చొప్పున జరిమానా చెల్లించాలని జస్టిస్ దీపక్ గుప్తా, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
అలాగే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరం ప్రభుత్వాలు స్పందించని నేపథ్యంలో 50వేల రూపాయిల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించి నాలుగు వారాల్లోగా ఈ రాష్ట్రాలు స్పందన తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 1993 నాటి మానవ హక్కుల పరిరక్షణ చట్టం మేరకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేసి ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాల్సి ఉంది.