క్రైమ్/లీగల్

పండగకు ఊరెళితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 13: బక్రీద్ పండుగకు ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరి జరిగిన సంఘటన షాద్‌నగర్ పట్టణంలోని ప్యారడైజ్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం షాద్‌నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ సోదరుడు సయ్యద్ జమీల్ ప్యారడైజ్ కాలనీలో కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. సోమవారం బక్రీద్ పండుగకు కుటుంబంతో సొంత గ్రామమైన కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కు వెళ్లి, అదేరోజు రాత్రి తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. సుమారు రూ.లక్ష 50వేల నగదు, దాదాపు 5తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు వివరించారు. సంఘటనా స్థలాన్ని షాద్‌నగర్ పట్టణ సీఐ శ్రీ్ధర్‌కుమార్ సందర్శించిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.