క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: మున్సిపల్ ఎన్నికలపై గత పక్షం రోజులుగా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ బుధవారం నాటికి వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై వాదనలను బుధవారం నాడు వింటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజే విచారణలను చేపట్టాలన్న ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఎన్‌కౌంటర్‌పై విచారణ
గుండాల లింగన్న ఎన్ కౌంటర్‌పై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ కొనసాగింది.లింగన్న రీ పోస్టుమార్టం రిపోర్టును ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
అక్రిడిటేషన్లపై పిటిషన్
తెలంగాణలో జర్నలిస్టులకు జారీచేసే అక్రిడిటేషన్ కార్డుల జారీపై ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో అక్రిడిటేషన్లను జీవో 96 ద్వారా జారీ చేసిందని, తెలంగాణ విభజన అనంతరం 96 జీవోను తొలగించి జీవో 239ని తీసుకొచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల అనేక మందికి అక్రిడిటేషన్లు రాలేదని ,ఫలితంగా చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రామచంద్రమూర్తి కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు అక్రిడిటేషన్లను జారీ చేస్తున్నారని అన్నారు. ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం నాడు విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.