క్రైమ్/లీగల్

క్రీస్తు పూర్వమే అక్కడ ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి ముందే అయోధ్యలోని ప్రస్తుత వివాదాస్పద స్థలంలో అత్యంత విస్తృత స్థాయిలో రామాలయం ఉందని రాంలల్లా విరాజ్‌మాన్ అనే హిందూ సంస్థ న్యాయవాది సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అయోధ్యపై రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం కేసు విచారణ జరిగింది. విరాజ్‌మాన్ సంస్థ న్యాయవాది ఇందుకు సంబంధించి ఆధారంగా 1950 నాటి ఒక కీలక పత్రాన్ని కూడా కోర్టు పరిశీలనకు నివేదించారు. ఈ వివాదానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించాలని.. అప్పట్లో కోర్టు నియమించిన కమిషనర్ నివేదికలో ఆలయ ఉనికికి సంబంధించిన అంశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. అలాగే, ఈ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై తమ హక్కులను ధ్రువీకరించుకోవడానికి భారత పురావస్తు శాఖ నివేదికలను కూడా ఆయన ఉటంకించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదంపై రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలోనే ఈ స్థలంలో భారీ రామాలయం, అలాగే, స్తంభాలు కూడా ఉన్నాయని ఈ హిందూ సంస్థ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు వివరించారు. ఈ స్థలంలో ధ్వజస్తంభాలతో పాటు మండపం కూడా ఉందని ఏఎస్‌ఐ నివేదిక తిరుగులేని
రీతిలో వెల్లడించిందన్నారు. ఇందుకు సంబంధించి వివాదాస్పద స్థలంలో వెలికి తీసిన పరికరాలపై అనేక రకాలుగా బొమ్మలు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. అయితే, అక్కడ ఉన్నది కేవలం రామాలయమేనా? అన్నదానికి సంబంధించి వీటిపై ఆధారాలు లేవనీ.. కానీ పరమశివుడి బొమ్మలు, సింహాల మధ్య ఉన్న గరుడపక్షి బొమ్మలు అలాగే, కమలం బొమ్మలు ఉన్నాయని తెలిపారు. వీటన్నింటినీ బట్టి చూస్తే అక్కడ కచ్చితంగా ఓ ఆలయం ఉండి ఉంటుందన్న విషయం స్పష్టవౌతోందని అన్నారు. కానీ ఇలాంటివేవీ మసీదుల్లో కనిపించవని వెల్లడించారు. హిందువుల మత విశ్వాసాన్ని, సంభావ్యతలను దృష్టిలో పెట్టుకొంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్నది రామాలయమేనన్న విషయం స్పష్టవౌతుందన్నారు. అలాగే, ఇందుకు సంబంధించి దొరికిన ఇతర ఆధారాలను పరిశీలించినా వివాదాస్పద స్థలంలో ఉన్నది రామాలయమేనని తిరుగులేకుండా రుజవు అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును కూడా వైద్యనాథన్ నివేదించారు. ఆ తీర్పునిచ్చిన న్యాయవాదుల్లో ఒకరైన జస్టిస్ ఎస్‌యు ఖాన్ మాత్రం ఏఎస్‌ఐ నివేదికను తన తీర్పులో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఖాళీ స్థలంలోనూ ఆలయ శిథిలాలపైన మసీదును నిర్మించారని తప్పుడుగా నిర్దారణకు వచ్చారని తెలిపారు. కానీ ఆ బెంచ్‌లో ఉన్న మరో ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం ఏఎస్‌ఐ నివేదికను పరిశీలించారని.. అక్కడ ఆలయం ఉందని అక్కడే మసీదు కూడా నిర్మితమైందని వైద్యనాథన్ తెలిపారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలోనే ఇక్కడ ఆలయం ఉందన్న ఆధారాలు ఉన్నాయని.. అనంతర కాలంలో ముఖ్యంగా కుషణులు, గుప్తుల కాలంలో దీనికి ఎన్నో మార్పులు జరిగాయని వైద్యనాథన్ గుర్తు చేశారు. అయితే, దీనిపై స్పందించిన రాజ్యాంగ బెంచ్.. ‘ఈ వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణం ఉండేదన్న దాంతో మాకు సంబంధం లేదు.. మసీదు నిర్మాణానికి ముందు అది మతపరమైనదా? కాదా? అన్నదే మాకు కావాలి’ అని పేర్కొంది. నాగరిక క్రమంలో ఎన్నో భవనాలను కూల్చేస్తున్నారని.. వాటి స్థానంలోనే కొత్త వాటిని నిర్మిస్తున్నారని పేర్కొన్న సుప్రీంకోర్టు.. మసీదు నిర్మాణానికి ముందు ఈ ప్రాంతంలో ఆలయం ఉండేదా? లేదా? అన్నదానిపై తమకు ఆధారాలు కావాలని స్పష్టం చేసింది. దీనికి స్పందించిన వైద్యనాథన్.. ఈ స్థలంలో ఆలయం ఉండేదని.. నిర్మాణాన్ని కూల్చివేసి మళ్లీ కట్టినా పునాదులు మాత్రం మారలేదని తెలిపారు. మొత్తం 17 వరుసల్లో స్తంభాల పునాదులు ఉన్నాయని.. ఒక్కొక్క దానిపై ఐదు స్తంభాలను కట్టారని తెలిపారు.