క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 17: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని అహ్మద్‌గూడ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముంటున్న కొర్వి ప్రేమాకర్ (27) సమీపాన గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా సెంట్రింగ్ పని చేస్తూ జీవించేవాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.