క్రైమ్/లీగల్

ముగ్గురు మావోల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం) : ముగ్గురు మావోయిస్టులు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారిని హాజరు పరిచి, ఇందుకు సంబంధించిన వివరాలను డీఐజీ రంగారావు తెలియజేశారు.
లొంగిపోయిన వారిలో నల్గొండ జిల్లా పెద్దరాసరపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బోడా అంజయ్య(30) అలియాస్ భాస్కర్ అలియాస్ నవీన్‌పై రూ. ఆరు లక్షల రివార్డు ఉంది. 2004 నుండి 2019 వరకు నల్గొండ, ఒడిశా, చత్తీస్‌ఘడ్, విశాఖలోని కోరుకొండ, గాలికొండ ప్రాంతాల్లో వివిధ క్యాడర్లలో దళ సభ్యునిగా, ఎసీఎమ్ హోదాలలో పని చేసి ఇప్పుడు డీసీఎమ్‌గా ఈస్ట్ డివిజన్ ఏరియా(కాఫీ కమిటీ) పని చేస్తున్నాడు. ఇతనిపై ఐదు హత్య కేసులతో పాటు ఏడు ఎదురు కాల్పులు, రెండు బ్లాస్టింగ్‌లు, మూడు ఆస్తుల దగ్ధం, నాలుగు కరవుదాడుల్లో పాల్గొన్నట్టు డీఐజీ తెలిపారు.
లొంగిపోయిన మరో మావోయిస్టు కొర్రా వెంకటరావు(29) అలియాస్ శ్రీకాంత్ ఏసీఎం క్యాడర్‌కు చెందిన వ్యక్తి. ఇతనిపై రూ.నాలుగు లక్షల రివార్డు ఉంది. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ళ పంచాయతీ కన్నవరం గ్రామం నూకదొర ప్రాంతానికి వెంకటరావు 2010నుండి 2019వరకు మిలిషియా స్థాయి నుండి దళ సభ్యునిగా, తర్వాత పెదబయలు దళం, ఏఓబి టెక్నికల్ టీంలలో పని చేశాడు. మూడు ఎదురు కాల్పులలోను, రెండు బ్లాస్టింగ్‌లు, ఓ ఆస్తి ధ్వంసం సంఘటనలో వెంకటరావు పాల్గొన్నాడు. మరో మావోయిస్టు అయిన సీంద్రి కాంద్రి అలియాస్ జీవని అలియాస్ జ్యోతి అలియాస్ సావిత్రి 2013 నుండి 2019 వరకు వివిధ హోదాల్లో కొనసాగింది. ఈమెపై కూడా రూ.నాలుగు లక్షల రివార్డు ఉంది. మొదట మావోయిస్టు పార్టీ సానుభూతిపరురాలిగా చేరి, దళం సభ్యురాలిగా, తర్వాత ఎసీఎం గాలికొండ దళంలో, పెదబయలు, గుర్తేడు దళాలల్లో పని చేసింది. ఈమె పదకొండు నేరాల్లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. విశాఖ జిల్లాలోని జీకే వీధిలో ఓ హత్య కేసు, ఒడిశాలో రెండు ఎదురు కాల్పులు, జీకేవీధిలోని ఓ కిడ్నాప్, ధారకొండ సెల్‌టవర్ ధ్వంసం సంఘటనలో, రెండు కరవుదాడుల్లో ఈమె పాల్గొంది. ఈ సందర్భంగా డీఐజీ రంగారావు మాట్లాడుతూ మావోయిస్టు ఉధ్యమం అవశ్యకత ఇప్పుడు ఏజెన్సీలో అవసరం లేదని, ప్రస్తుత సమాజంలో విప్లవం అవసరం లేదని, మావోయిస్టులు ప్రజాబాహుళ్యంలోకి వచ్చి ప్రజాస్వామ్యపరంగా పని చేయవచ్చన్నారు. మావోయిస్టులను ఆరాధించిన వారిని ఇన్‌ఫార్మర్‌ల పేరుతో హత్యలు చేస్తున్నారని, దీని వలన గిరిజనుల్లో అపనమ్మకం, అనుమానం కలుగుతున్నాయన్నారు. లొంగిపోయిన నవీన్ మాట్లాడుతూ మావోయిస్టు నాయకులు జగన్, అరుణ వలన పార్టీలో విభేదాలు వచ్చాయని, వారితో ఇక వేగలేక పార్టీకి ఉత్తరం రాసి లొంగిపోయినట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ బాబూజీ, ఓఎస్‌డీ బి కృష్ణారావు, జిల్లా పోలీసులు పాల్గొన్నారు.

చిత్రం... లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు వెల్లడిస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు