క్రైమ్/లీగల్

ప్రతీదీ రాజకీయమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: తుఘ్లఖాబాద్‌లో గురు రవిదాస్ ఆలయం కూల్చివేతకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలకు రాజకీయ రంగు పులుముతున్నారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తుఘ్లఖాబాద్‌లోని అటవీ ప్రాంతంలో ఆలయంపై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశించినా గురు రవిదాస్ జయంతి సమరోహ్ సమితి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయలేదు. దీనిపై న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు, తీర్పులను విమర్శిస్తే సహించేది లేదు’అని ధర్మాసనం తీవ్ర స్వరంతో హెచ్చరించింది. రవిదాస్ ఆలయం కూల్చివేతను రాజకీయం చేయడం మానుకోవాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.‘ప్రతిదాన్నీ రాజకీయం చెయొద్దు. మేం ఇచ్చిన ఆదేశాలను రాజకీయ రంగు పులుమితే ఎలా?’అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం ఆదేశాలే అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారణే అని న్యాయమూర్తులు అన్నారు. తుఘ్లఖాబాద్ అటవీ ప్రాంతంలోని 500 ఏళ్లనాటి ఆలయాన్ని కూల్చివేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. దళిత సామాజిక వర్గం కూడా నిరసనలో పాల్గొన్నాయి. కోర్టు ఆదేశాల అమలుకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ రంగంలోకి దిగగా, 18 సంస్థలకు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ వివాదం పరిష్కారానికి సహకరించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను మధ్యవర్తిగా నియమించింది. ఈ అంశం సోమవారం విచారణకు వచ్చింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ పలు సంస్థలు ఆందోళన చేపట్టాయని, పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని కోర్టుకు తెలిపారు. ‘సమస్య పరిష్కారమైంది. ఆలయానికి సంబంధించి ఎలాంటి వివాదం లేనట్టే. మళ్లీ ఈ అంశంపై కోర్టులో వ్యాజ్యం ఏమిటి?’అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించినట్టు బెంచ్‌కు తెలిపారు. ‘రాజకీయంగానే కాదు ఏ విధంగా కూడా దానిపై వివాదం సృష్టించకండి’అని ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా పడింది. రవిదాస్ ఆలయం కూల్చివేత అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. రవిదాస్ సామాజిక వర్గం వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్తానని ఆయన తెలిపారు. అలాగే హర్యానాలోని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. రవిదాస్ ఆలయాన్ని స్థలం కేటాయించాలని మోదీని కోరనున్నట్టు ఆయన చెప్పారు.