క్రైమ్/లీగల్

ఉన్నావో కేసు.. నాలుగు వారాలు గడువు కోరిన సీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉన్నావో ఘటన బాధితురాలి రోడ్డు ప్రమాద కేసు దర్యాపుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు దర్యాప్తును రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తరఫు న్యాయవాదికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల మధ్యంతర పరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ 14 రోజుల్లో పూర్తి చేయాలని ఆగస్టు ఒకటిన ఆదేశించింది. అత్యాచార ఘటనపై 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని నిర్దేశించింది. కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మరో ఏడు రోజుల గడువును పొడిగించవచ్చునని తెలిపింది. అలాగే ఈ కేసును ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోని కోర్టును బదిలీ చేసింది. కేసుకు సంబంధించిన నివేదికను ఆదివారం కోర్టుకు సీబీఐ సమర్పించింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని, అందువల్ల కేసు విచారణకు నాలుగు వారాల గడువు కావలని సోమవారం కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చెసింది. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో రెండు వారాల గడువునిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. అత్యాచార బాధితురాలు, ఆమెతో పాటు న్యాయవాదికి సుప్రీం కోర్టు ఆదేశాలతో సీఆర్పీఎఫ్‌తో భద్రత చేపట్టింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్‌ను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ఈ కేసుపై సీతాపూర్ జైలులో ప్రశ్నించారు. నలుగురు అధికారులతో కూడిన మరో సీబీఐ బృందం బాధితురాలి స్వగ్రామాన్ని సదర్శించి దర్యాప్తు చేపట్టింది.