క్రైమ్/లీగల్
దమ్ము ట్రాక్టర్ తిరగబడి కౌలురైతు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
గుడ్లవల్లేరు, ఆగస్టు 19: దమ్ము ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో కౌలు రైతు మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని కూరాడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కోటప్రోలు వెంకట చలపతిరావు 20 సంవత్సరాల క్రితం విజయవాడ నుండి కుటుంబంతో సహా వచ్చి కూరాడకు చెందిన రైతు శేకమూరి గోపాలకృష్ణ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా ట్రాక్టర్‌తో పొలాన్ని దమ్ము చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. ట్రాక్టర్ కింద పడిన చలపతిరావు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.