క్రైమ్/లీగల్

ఊపిరందక 10 గోవుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజనందగావ్, ఆగస్టు 20: చత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ జిల్లాలో ఊపీరి ఆడక 10 ఆవులు మృతి చెందాయి. యజమాని అనాలోచిత చర్య వల్లే అవి మృత్యువాత పడ్డాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున రాజనందగావ్ జిల్లాలోని బార్బస్‌పూర్ గ్రామంలో రైతు తన 10 అవులను లోపలి గదిలో బంధించి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే వాటికి గాలి, వెలుతురు అందక మృత్యువాతపడ్డాయి. అయితే రెండు రోజుల క్రితం దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల నివసిస్తున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గది తాళం తీయించి ఆవులు మరణించి ఉండడం చూసి అవాక్కైయ్యారు. వెటర్నరీ డాక్టర్ల బృందం ఆవులకు పరీక్షలు నిర్వహించి అవి కేవలం ఊపిరీ ఆడకనే మృత్యువాత పడినట్లు నివేదిక ఇచ్చారు. భారీ వర్షాలు కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమ ఆవుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందని, గతంలో కూడా ఇలాగే బంధించానని అవుల యజమాని చెప్పాడు. ఇలాఉండగా దీనిపై విచారణ జరపాల్సిందిగా చుక్కిఖాదన్ సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ అవినాష్ ఆదేశించారు. దీనిపై సర్పంచ్‌కు, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు పోలీసులు కూడా అవులను గదిలో బంధించిన యజమానిపై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.