క్రైమ్/లీగల్

నవయుగ వ్యాజ్యంపై తీర్పు రిజర్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. అర్ధంతంరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడంపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్టు 14న ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ డైరెక్టర్ రమేష్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయ స్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు కోర్టులో వినిపించారు. జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు స్థలం చూపించాల్సిన బాధ్యత ఏపీజెన్‌కోపై ఉందని, స్థలం చూపించకపోవడం కారణంగా నిర్మాణం చేపట్టలేకపోయామని నవయుగ తరపున న్యాయవాది వాదించారు. ఏపీజెన్‌కోతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించలేదని గుర్తు చేశారు. 2021 నవంబర్ వరకూ తమ కాంట్రాక్టుకు గడువు ఉందని, కాంట్రాక్టు రద్దు చేస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరారు.
ప్రాజెక్టు నిర్మాణంలో తమనే కొనసాగించాలని, రివర్స్ టెండరింగ్‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఎటువంటి పురోగతి లేదని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.