క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలపై సర్కారు కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బుధవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగిం ది. ఎన్నికలకు సంబంధించి అన్నీ సక్రమంగా చేస్తామని పేర్కొంటూ ప్రభు త్వం సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వం దృష్టికి వచ్చిన అభ్యంతరాలను కూడా సరిచేస్తామని పేర్కొంది. దాంతో కౌంటర్‌పై ఈ నెల 28న వాదనలు కొనసాగించనున్నట్టు పేర్కొంటూ
హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
చెన్నమనేని కేసు విచారణ
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. పౌరసత్వంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. గతంలో హైకోర్టు తీర్పుపై తాను సంతృప్తిగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. మరోసారి పౌరసత్వంపై కేంద్ర హోం శాఖను సంప్రదించాలని రమేష్‌కు హైకోర్టు సూచించింది. హైకోర్టులో వాదనల అనంతరం పిటిషన్ విత్‌డ్రా చేసుకుంటున్నట్టు రమేష్ పేర్కొన్నారు.