క్రైమ్/లీగల్

ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై సీబీఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తదితరులు 2007-09 మధ్య కాలంలో పెట్టుబడుల విషయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అయితే, సీబీఐ అభియోగాలను ఎన్‌డీటీవీ తోసిపుచ్చింది. రాయ్‌లతో పాటు కంపెనీ సీఈఓ విక్రమాదిత్య చంద్ర, గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపైన నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి అభియోగాలు మోపుతూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని అధికారులు బుధవారం తెలిపారు. సీబీఐ అధికారుల బృందం బుధవారం చంద్ర నివాసంలో సోదాలు చేసిందని అధికారులు తెలిపారు. లండన్‌లోని ఎన్‌డీటీవీ అనుబంధ కంపెనీ నెట్‌వర్క్ పీఎల్‌సీ (ఎన్‌ఎన్‌పీఎల్‌సీ)లో 2006 నవంబర్ 30న ఆ సమయంలో జనరల్ ఎలక్ట్రిక్ అనుబంధ కంపెనీ అయిన ఎన్‌సీబీయూ పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఎన్‌ఎన్‌పీఎల్‌సీ 2009లో ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) నుంచి ఆమోదం పొందిందనేది సీబీఐ అభియోగం. ఎన్‌ఎన్‌పీఎల్‌సీ మొత్తం 163.43 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను స్వీకరించిందని, ఈ మొత్తాన్ని ఎన్‌డీటీవీకి చెందిన వివిధ అనుబంధ సంస్థల్లో సంక్లిష్టమయిన లావాదేవీల ద్వారా పెట్టుబడులుగా పెట్టిందని సీబీఐ పేర్కొంది. అయితే, సీబీఐ అభియోగాలను ఎన్‌డీటీవీ ఒక ప్రకటనలో గట్టిగా ఖండించింది. ‘ఎన్‌డీటీవీకి, దాని వ్యవస్థాపకులకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. కంపెనీ జర్నలిజం నీతి, నిజాయితీల పట్ల నిబద్ధత కొనసాగుతుంది. దురుద్దేశపూరితంగా కల్పితమయిన అభియోగాలు నమోదు చేయడం ద్వారా స్వేచ్ఛగా, పారదర్శకంగా వార్తలు, వార్తాకథనాలు ప్రసారం చేయడాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాలు విజయం సాధించబోవు. ఇది కంపెనీకి, వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేయాల్సిన పెద్ద పోరాటమిది’ అని ఎన్‌డీటీవీ ఆ ప్రకటనలో పేర్కొంది.