క్రైమ్/లీగల్

నగరంలో టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 22: నగరంలోని పలు దుకాణాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా వి క్రయాలు జరుపుతున్న నలుగురు వ్య క్తులను అదుపులోకి తీసుకుని సుమా రు రూ.9.97లక్షలు విలువ చేసే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఏడీసీపీ కేవీ శ్రీనివాసరావు, ఏసీపీలు కే సూర్యచంద్రరావు, వీఎస్‌ఎన్ వర్మ ఆధ్వర్యాన సిబ్బంది వ న్‌టౌన్, నున్న, పటమట, భవానీపురం, కంకిపాడు తదితర పోలీస్టేషన్ల పరిధి లో అనుమతి లేని సిగరెట్లు అమ్ముతు న్న షాపులపై దాడులు నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దా డులు నిర్వహించారు. ఫరెవర్-3,535, పారిస్-2,773, 47 మరో ఇతర బ్రాం డ్లు సిగరెట్లు ప్యాకెట్లు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని ఆయా పోలీస్టేషన్ల లో అప్పగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు ఎగవేస్తూ మయన్మా ర్, బంగ్లాదేశ్ నుంచి దేశానికి దిగుమతి చేసుకుని హైదరాబాద్, కలకత్తా వంటి నగరాల ద్వారా ఇక్కడకు తరలించి ఈ అక్రమ విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.