క్రైమ్/లీగల్

మురుగునీటి పార్శిల్ కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులకు పోస్టల్ సర్వీస్ ద్వారా పార్శిల్‌లో మురుగునీరు బాటిల్స్ పంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత తదితర ప్రముఖులకు మంగళవారం ఓ అజ్ఞాత వ్యక్తి పార్శిళ్లు పంపిన విషయం విదితమే. తొలుత వీటిని రసాయనాలుగా భావించిన పోలీసులు పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించడం జరిగింది. బాటిల్స్‌లో ఉన్నది కేవలం మురుగునీరేనని, రసాయనాలు కాదని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే నిందితుడు ఇలా చేసిఉండవచ్చని సమాచారం. పట్టుబడ్డ నిందితుడి మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.