క్రైమ్/లీగల్

కేంద్ర హోం మంత్రి మెడల్‌కు ఎంపికైన 15మంది సీబీఐ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేంద్ర హోం మంత్రి పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మకమైన మెడల్‌కు 15 మంది సీబీఐ అధికారులు ఎంపికయ్యారు. పరిశోధనలో అత్యున్నత సమర్థత కనిపించిన 15 మంది అధికారులు ఈ ఏడాది (2019)కి ఎంపికయ్యారని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశ వ్యాప్తంగా 96 మంది ఎంపిక కాగా అందులో 15 మంది సీబీఐ అధికారులు ఉన్నారు. పోలీసులను ప్రోత్సహించేందుకు గత ఏడాది నుంచి ఈ అవార్డులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇస్తున్నది. ఎంపికైన సీబీఐ అధికారులు భరతేందర్ శర్మ (డీఎస్‌పి-్భపాల్), పెద్దిరాజు బండి (డిఎస్‌పి-న్యూఢిల్లీ), చిత్తరంజన్ దాశ్ (డిఎస్‌పి-కోల్‌కత్తా), పుష్పల్ పాల్ (డిఎస్‌పి-న్యూఢిల్లి), గుల్షన్ మోహన్ రతి (డిఎస్‌పి-న్యూఢిల్లీ), బ్రజేష్ కుమార్ (డిఎస్‌పి-బెంగళూరు). ఇంకా ఛత్తీస్‌గడ్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ చందర్, ముంబయి ఇన్‌స్పెక్టర్ గణేష్ లింగయ్య, భోపాల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ సింగ్, న్యూఢిల్లీ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్, భోపాల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ సోలంకి, న్యూఢిల్లీ సబ్-ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్, బెంగళూరు ఇన్‌స్పెక్టర్ పి. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ వి. వివేకానంద ఉన్నట్లు అధికారులు తెలిపారు.