క్రైమ్/లీగల్

ట్రిపుల్ తలాక్ చెల్లుబాటుపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ట్రిపుల్ తలాక్ రద్దుచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. దాన్ని పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ముస్లిం వివాహితకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం కొత్త చట్టంలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. చట్టం కింద సదరు భర్తకు మూడు నెలలు జైలుశిక్ష పడుతుంది. ముస్లిం సమాజంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ట్రిపుల్ తలాక్‌ను కేంద్రం రద్దుచేసిన కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ముస్లిం మహిళ(వివాహం హక్కుల రక్షణ) చట్టం 2019 రాజ్యాంగ విర్ధుమని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఓ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. శుక్రవారం ఈ పిటిషన్లు విచారించిన న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, అజయ్ రస్తోగి కొత్త చట్టం చెల్లుబాటుపై పరిశీలిస్తామని ప్రకటించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ట్రిపుల్ తలాక్‌పై చేసిన చట్టంలో అనేక కోణాలున్నాయని, భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించాలన్న అంశం చాలా తీవ్రమైందని ఖుర్షీద్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని న్యాయస్థానం పరిశీలించాలని ఆయన అభ్యర్థించారు. మహిళ హక్కుల పేరుతో మతాచారాలు, విశ్వాసాలను కాదనడం దీన్ని కొత్త చట్టంలో పొందుపరచటం అభ్యంతరకరమని ఆయన అన్నారు.
ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించడంతోపాటు ఆమె వాదన విన్నాకే బెయిల్ ఇవ్వాలన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. ముమ్మారు తలాక్‌ను రద్దుచేస్తూ వచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. జమాతే ఉలేమా-ఏ హింద్, సమస్త కేరళ జమైతుల్ ఉలేమా, సున్నీ ముస్లిం మేధావులు, కేరళ ముస్లిం పెద్దలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కొత్త చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించింది.