క్రైమ్/లీగల్

మహిళపై అత్యాచారం చేసి.. హత్యచేసిన నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, ఆగస్టు 23: గత వారం గిరిజన మహిళను హత్యచేసిన నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. భర్త కోరిక మేరకు మరో ఇద్దరు ఆమెకు మద్యం తాగించి, అత్యాచారంచేసి హతమార్చారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్‌పీ కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. ఔరంగాబాద్ తండాకు చెందిన కెతావత్ విజయను ఈ నెల 17న రాత్రి అత్యాచారం జరిపి హత్యచేసిన విషయం తెలిసిందే. భర్త కెతావత్ దేవుల మలేషియా వెళ్లి వచ్చిన తర్వాత భార్యాభర్తలు తరచు గొడవపడేవారు. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయంలో కూడా తండా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అయినా ఆమె మారకపోవడంతో హవేళీఘణాపూర్ తండాకు చెందిన ముడావత్ రూప్‌సింగ్‌తో దేవులా స్నేహంగా ఉంటూ ఆమెను హత్యచేసేందుకు పదివేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 17న సాయంత్రం విజయను మెదక్ సినీమ్యాక్య్ థియేటర్‌లో సినిమా చూయించిన అనంతరం వైన్స్‌లో మద్యం బాటిల్ తీసుకుని బైక్‌పై అవుసులపల్లి శివారుకు తీసుకెళ్లారు. విజయ, రూప్‌సింగ్‌లతోపాటు మరో వ్యక్తి మదన్ ఉన్నాడు.
చెట్టుకింద మద్యం తాగించిన అనంతరం ఇరువురు ఆమెను అత్యాచారం జరిపి చీరతో మెడను గట్టిగా గుంజడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పథకం ప్రకారం బార్యను చంపినట్లు భర్త దేవులకు సమాచారం అందజేశారు. కేసును విచారించిన రూరల్ సీఐ రాజశేఖర్ నిందితులను అరెస్టుచేసినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో టౌన్ ఇన్స్‌పెక్టర్ వెంకట్, ఎస్‌ఐలు లింబాద్రి, శ్రీకాంత్‌తోపాటు సిబ్బంది తాహేర్, క్రిష్ణ, భాస్కర్, రాములు, బాసిత్‌అలీ, విజయ్, యాదగిరి, గోపాల్, సాయిబాబ, విజయ్, వెంకట్‌ల కృషిని అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఎస్‌పిని కోరనున్నట్లు డీఎస్‌పీ కృష్ణమూర్తి తెలిపారు.