క్రైమ్/లీగల్

కార్లు, బైక్‌ల చోరీ కేసుల్లో అంతరాష్ట్ర ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 24: కార్లు, మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13కేసుల్లో సుమారు రూ.19.20లక్షల విలువ చేసే పది కార్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయారావు తెలిపారు. తన ఛాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పగటిపూట, రాత్రి సమయాల్లో కార్లలో సంచరిస్తూ నగరంలో పార్కింగ్ చేసిన కార్లు, మోటారు సైకిళ్లను గుర్తించి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రివేళ కారు సైడు అద్దాలు పగులగొట్టి అపహరించుకుపోవడం, అదేవిధంగా తాళం వేసిన బైక్ హ్యాండిల్ లాక్‌ను విరగగొట్టి చోరీ చేయడం నిందితులకు పరిపాటి. ఆయా ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసిన దర్యాప్తు బృందాలు ఎట్టకేలకు నిందితులను గుర్తించి కృష్ణాజిల్లా ఘంటసాలకు చెందిన తాతాప్రసాద్ అలియాస్ మామిళ్ళపల్లి శశిధర్ (35), భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డుకు చెందిన నామాల నాగరాజు (27), జగ్గయ్యపేట మండలం గౌరవరంకు చెందిన బానావత్ సురేష్ (28), కంచికచర్ల మండలం హనుమాన్‌పేటకు చెందిన దొడ్డక గోవర్థన్ (25), తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా తాడిగొంబుకు చెందిన పెరియా స్వామి మారిముత్తు (38)లను అరెస్టు చేశారు. నిందితులు భవానీపురం పోలీస్టేషన్ పరిధిలోని నేరాలకు పాల్పడిన సంఘటనాస్థలాల్లో లభించిన ఆధారాలు, సీసీ టీవీ పుటేజీ, టవర్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీసీపీ చెప్పారు. నిందితుల నుంచి రూ.19,20,000 లక్షల విలువైన పది కార్లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మూడు తవేరా కార్లు, షిఫ్టు డిజైర్ కారు, ఐదు బొలేరో కార్లు, ఒక ఆల్టో, మూడు మోటారు సైకిళ్లు ఉన్నాయి. విలేఖరుల సమావేశంలో అదనపు డీసీపీ ఎల్‌టి చంద్రశేఖర్, వెస్ట్‌జోన్ ఏసీపీ సుధాకర్, భవానీపురం సీఐ డీ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ వీ కృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.