క్రైమ్/లీగల్

సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 10: రద్దీ ప్రాంతాల్లో తిరిగే ప్రజలనే లక్ష్యంగా చేసుకొని సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఒక బాలుడు సహా ఐదుగురు అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ల దొంగల ముఠాను మంగళవారం వరంగల్ జిల్లా హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠా సభ్యుల నుండి సుమారు 30 లక్షల విలువ గల 87 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే. వారిలో కర్నూల్ జిల్లా డోన్ మండలం శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన కావడి పోచయ్య, అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం నల్లకుంట గ్రామానికి చెందిన ఆకుల వడివేలు, అదే గ్రామానికి చెందిన పూసల సాయిరాం, పూసల సుబ్బారాయుడు ఉన్నారు. వీరితో పాటు ఒక మైనర్ బాలుడుని పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు మైనర్ బాలురు పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోని ప్రధాన నిందుతుడైన కావడి పోచయ్య ఆలియాస్ చందూ కర్నూల్ జిల్లాలో ఆటో నడుపుతూనే మద్యానికి, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడడంతో తన జల్సాలకు అవసరమైన డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడే వాడు. అదేవిధంగా మరో ముగ్గురు నిందితులైన ఆకుల వడివేలు, పూసల సాయిరాం, పూసల సుబ్బారాయుడు అనంతపురం జిల్లాలో సెల్‌ఫోన్లతో పాటు జేబుల్లో పర్సులు దొంగతనాలకు పాల్పడడంతో ప్రధాన నిందితుడు కావిడి పోచయ్య మిగతా ముగ్గురు నిందితులతో పరిచయం ఏర్పడడంతో నిందితులు ఒంటరిగా చోరీలు చేయడమే కాకుండా ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ల చోరీలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చోరీలు చేయడంతో పాటు తన బంధువులకు చెందిన ముగ్గురు బాలురకు సైతం శిక్షణ ఇచ్చి తమ ముఠాలో చేర్చుకున్నారు. ఇందులో భాగంగా ఈ ముఠా సభ్యులు సెల్‌ఫోన్ల్ చోరీలు చేసేందుకు ముందుగా కార్లను తీసుకొని వెళ్ల రద్దీ అధికంగా ఉండే పుణ్యక్షేత్రాలు, మార్కెట్లు, సంతలను గుర్తించే వారు. ఇలా గుర్తించిన ప్రాంతాల్లో నిందితులు రాత్రి సమయంలో అక్కడే నిద్రించి మరుసటి రోజున ముఠా సభ్యులు తమతో వచ్చిన మైనర్ బాలలను తమ వెంట తీసుకొని వెళ్లేవారు. ఇలా రద్దీ ప్రాంతాలకు వెళ్లిన ముఠా సభ్యులు ముందుగా వారు సెల్‌ఫోన్ దొంగతనం చేయాల్సిన వ్యక్తిని గుర్తించి సదరు వ్యక్తి కూరగాయలు లేదా ఏదైనా వస్తువు కోనుగోలు చేసే క్రమంలో మైనర్ నిందితుడు ముందుగా సెల్‌ఫోన్ చేసే వ్యక్తి పక్కనే నిలుచోని తాను సైతం కూరగాయలు కోనుగోలు చేస్తున్నట్టు నటిస్తూనే సదరు వ్యక్తుల పై జేబులోని సెల్‌ఫోన్‌ను చోరీ చేసే వాడు. ఇదే క్రమంలో బాల నేరస్తుడుని సహాయంగా ముఠా సుభ్యులు పక్కనే సంచులతో నిలుచొని పరిసరాలను గమనించేవారు. ఇలా రద్దీ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అనంతరం నిందితులు అదే ప్రాంతంలో ఉండకుండా తాము వచ్చిన కారులో తిరిగి ఇతర ప్రాంతాల్లో చోరీలు చేసేందుకు వేళ్ళేవారు.