క్రైమ్/లీగల్

బెయిల్ కోసం చిదంబరం పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం బెయిల్ కోసం బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనను 14 రోజులు జుడీషియల్ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. చిదంబరంను ఈనెల 19 వరకూ జుడీషియల్ కస్టడీకి పంపుతూ సెప్టెంబర్ 9న ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో 37 చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. మాజీ ఆర్థిక మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఆయనకు పోలీసు రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది. అయితే చిదంబరం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికాబట్టి విచారణ సజావుగా సాగకుండా అవరోధాలు కల్పించే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. దీంతో ఆయనను తీహార్ జైలులోని ప్రత్యేక సెల్‌కు తరలించాలని, దానికి జడ్ సెక్యురిటీ కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వద్ద లొంగిపోవడానికి సంసిసద్ధత వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. చిదంబరం అరెస్టుకు అంతకు ముందే అంటే ఆగస్టు 20 ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినందున ఈడీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును చిదంబరం ఉపసంహరించుకున్నారు. అదే రోజు అంటే గత గురువారం నాడు ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసుల్లో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కార్తీపై సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల రూపంలో ప్రయోజనం చేకూర్చేందుకు సహకరించారని 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. 2007లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్‌ఎక్స్‌కు 305 కోట్ల రూపాయలు విదేశీ నిధులు అందాయని అభియోగం. తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. యూపీఏ హయాంలో 2004-14 కాలంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత నెల 21న ఢిల్లీలోని జోర్‌బాగ్‌లోని నివాసంలోనే చిదంబరంను అరెస్టు చేశారు.