క్రైమ్/లీగల్

చవకగా బైక్ అమ్ముతానంటూ టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, సెప్టెంబర్ 11: ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ యువకుడు రెండు లక్షల విలువ చేసే తన కేటీఎం ఆర్సీ 200 సీసీ గల బైక్‌ను 80 వేలకే అమ్ముతున్నానని చెప్పడంతో నమ్మిన మరో యువకుడు ఆన్‌లైన్ ద్వారా 50 వేలు చెల్లించి మోసపోయన సంఘటన రాయపర్తి మండలంలోని మైలారం శివారు చక్రుతండాలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తనకు జరిగిన మోసాన్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మోస పోయిన యువకుడు గుగులోతు రాజేందర్ వివరాలు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో తాను ఆర్మీలో పనిచేస్తున్నానని పరిచయమైన ఒక వ్యక్తి కొద్దిరోజుల తర్వాత రెండు లక్షల విలువ చేసే బైక్ ఉందని ఆర్మీలో ట్రాన్స్‌ఫర్ కావాలంటే డబ్బులు అవసరం ఉంటుందని అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తన బైక్‌ను 80 వేలకు అమ్ముతానని అనడంతో రాజేందర్ 70 వేలకు కొంటానని చెప్పడంతో దానికి ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. ముందుగా 30 వేలు చెల్లించాలని ఆనంతరం ట్రాన్స్‌పోర్టు ద్వారా బైక్ పంపుతానని తెలపడంతో ఆన్ లైన్ ద్వారా రాజేందర్ 30 వేలు పంపాడు. తర్వాత ట్రాన్స్‌పోర్టు కోసం 10 వేలు, బైక్ జీఎస్టీ కూడా కట్టాలని చెప్పడంతో మరో 10 వేలు పంపాడు. మూడు రోజులైనా బైక్ రావడం లేదని ఆ యువకుడు సదరు వ్యక్తికి ఫోన్ చేయడంతో మరోక ఐదు వేలు పంపాలని కోరడంతో తాను మోసపోయినట్టు గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.