క్రైమ్/లీగల్

నవంబర్‌లో స్కూలు ఫీజులపై తుది తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : స్కూల్ ఫీజులకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై తుది తీర్పును నవంబర్‌లో వెలువరించనున్నట్టు బుధవారం నాడు రాష్ట్ర హైకోర్టు సూచించింది. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన స్కూలు ఫీజుల పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకుంది. స్కూల్ ఫీజులకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లలో హెచ్‌ఎస్‌పీఏ ఇంప్లీడ్ అయ్యింది. పిల్ 149/2016లో ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొంది. దాంతో అప్పటివరకూ దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి ఉమ్మడిగా విచారించాలని నిర్ణయించినట్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఒక బ్యాచ్ కింద వచ్చిన అన్ని పిటిషన్లపై బుధవారం నాడు మొదటిసారి విచారణ మొదలైంది. పిల్ 4/2016, పిల్ 149/2016, రిట్ పిటిషన్ 1331/2018లపై ఈ విచారణ కొనసాగుతోంది. జీవో 91/2009 అడ్మిషన్ల ఫీజులకు సంబంధించిన జీవోపై పిల్ 4/2016 దాఖలైంది. జీవో 1/1994పై పిల్ 149/2016 దాఖలైంది. స్కూల్ ఫీజుల పెంపును నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమోపై హైకోర్టు స్టే మంజూరు చేయడంపై రిట్ పిటిషన్ 1331 /2018 దాఖలైంది.
మున్సిపల్ ఎన్నికలపై విచారణ 26కు వాయిదా
మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై విచారణ 26వ తేదీకి వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించామని ప్రభుత్వం తన అపిడవిట్‌లో పేర్కొనగా, ఇంకా పరిష్కరించాల్సినవి చాలా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.ప్రభుత్వం చెబుతున్నదానికీ ,చేస్తున్నదానికీ పొంతన లేదని పిటిషనర్లు పేర్కొనగా, ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించి, తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.
త్వరగా కేసు విచారణ చేపట్టాలని కోరగా ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించింది.