క్రైమ్/లీగల్

బాలుడిని బలితీసుకున్న వైద్యుడి నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, సెప్టెంబర్ 12: మండలంలోని ఎ కొండూరు చైతన్యనగర్ తండాకు చెందిన బాణావతు నాగరాజు రజిని కుమారుడు బాణావతు శ్రీనివాసరావు (6) జ్వరం సోకడంతో ఈ నెల 9వ తేదీ నుండి కంభంపాడు ఆర్‌ఎంపీ ఆర్‌ఎంపీ డాక్టర్ చలపతిరావు వద్ద వైద్యం చేయిస్తుండగా జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో అధిక మోతాదులో మాత్రలు ఇవ్వడం వల్ల అవి వికటించి అపస్మారక స్థితిలో ఉండగా బాధిత తల్లిదండ్రులు మైలవరం ప్రేవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీహెచ్‌సీ వైద్యులు అఫ్రీన్ సుల్తాన్ బాలుడి మృతదేహం వద్దకు వెళ్ళి పరిశీలించి మందులు పరీక్షించగా అధిక మోతాదులో మందులు వాడటం వల్ల బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై మృతుని తల్లిదండ్రులు బాణావతు నాగరాజు రజిని ఎ కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శవాన్ని పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.