క్రైమ్/లీగల్

హైకోర్టు, ట్రయల్ కోర్టులను ఆశ్రయించిన చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం గురువారం ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీలాండరింగ్ కేసులలో ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టులను ఆశ్రయించారు. సోమవారం జైలులోనే తన 74వ పుట్టిన రోజు జరుపుకోనున్న చిదంబరం అవినీతి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా హైకోర్టును, మనీలాండరింగ్ కేసులో లొంగిపోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ట్రయల్ కోర్టును అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీలో చిదంబరం సహచరులు సహా సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ఏఎం సింఘ్వీ, వివేక్ టంఖా, సల్మాన్ ఖుర్షీద్ ఆయన తరపున హైకోర్టులో న్యాయమూర్తి సురేశ్ కైట్ ఎదుట వాదనలు వినిపించారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వవలసిందిగా సీబీఐని ఆదేశించడంతో పాటు న్యాయమూర్తి ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. అవినీతి కేసులో ట్రయల్ కోర్టు తనకు సెప్టెంబర్ 19వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసి ఉన్న పిటిషన్‌ను చిదంబరం ఉపసంహరించుకున్నారు. రెండు వేర్వేరు పిటిషన్లు ఎందుకు దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించడంతో చిదంబరం మొదటి పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. హైకోర్టులో తాజా పిటిషన్‌పై విచారణ ముగిసిన కొన్ని గంటల తరువాత సిబాల్ కొంతమంది జూనియర్ న్యాయవాదులతో కలిసి రౌజ్ అవెన్యూలో గల ప్రత్యేక కోర్టుకు హడావుడిగా వెళ్లారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో చిదంబరం లొంగిపోవడానికి అనుమతించాల్సిందిగా ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. అయితే, ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ దీనిపై తన ఆదేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు.