క్రైమ్/లీగల్

చిన్మయానందను ప్రశ్నించిన సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాజహాన్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్), సెప్టెంబర్ 13: అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందను స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్) ఏడు గంటల పాటు విచారించింది. అనంతరం ఇక్కడి అతని నివాసంలోని పడకగదిని మూసివేసిందని పోలీసు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని తనను చిన్మయానంద రేప్ చేశారని ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటయిన సిట్ తన దర్యాప్తులో భాగంగా బాధితురాలయిన కళాశాల విద్యార్థినిని శుక్రవారం ఉదయం చిన్మయానంద నివాసానికి తీసుకొచ్చి ఆమె సమక్షంలోనే దర్యాప్తును కొనసాగించి, ఆధారాలు సేకరించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. సిట్ గురువారం రాత్రి చిన్మయానందను పోలీస్ లైన్స్‌లో సుమారు ఏడు గంటల పాటు విచారించిందని, దివ్య ధామ్ నివాసంలోని అతని బెడ్‌రూమ్‌ను సీల్ చేసిందని ఆ వర్గాలు వివరించాయి. చిన్మయానంద నివాసం వద్ద ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో దర్యాప్తు ముగిసేంత వరకు షాజహాన్‌పూర్‌ను వదలిపెట్టి వెళ్లొద్దని చిన్మయానందను సిట్ ఆదేశించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. చిన్మయానంద ఇంటి లోపల, బయట పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. యాజమాన్యం ఈరోజు కళాశాలకు సెలవు ప్రకటించి, దీనికి సంబంధించిన నోటీసును కళాశాల గేట్ మీద అంటించింది. చిన్మయానందకు చెందిన సంస్థ అనేక కళాశాలలను నడుపుతోంది. చిన్మయానంద చేతిలో తాను అత్యాచారానికి, ఏడాది పాటు 3శారీరక దోపిడీ2కి గురయ్యానని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆరోపించారు. ఆ విద్యార్థిని చదివిన కళాశాలలకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాల్‌లను కూడా సిట్ గురువారం విచారించింది. పోలీసులు తన హాస్టల్ గదిని సీల్ చేయడానికి ముందు అందులో ఉన్న కొన్ని కీలక ఆధారాలను చిన్మయానంద అనుచరులు తొలగించారని, ఆ విద్యార్థిని బుధవారం సిట్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.