క్రైమ్/లీగల్

శివకుమార్‌కు మరో 4రోజుల కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌ను మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ ఇప్పటికే గత తొమ్మిది రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. తొమ్మిది రోజుల కస్టడీ పూర్తి కావడంతో ఈడీ శివకుమార్‌ను ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి అజయ్‌కుమార్ కుహార్ ఎదుట ఈడీ హాజరు పరిచింది. మనీ లాండలింగ్ కేసులో స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా శివకుమార్ దాటవేశారనీ.. విచారణతో సంబంధంలేని సమాధానాలు ఇస్తున్నార నీ.. ఈయన ఆస్తుల్లో చాలావరకు బినామీ పేర్ల తో ఉన్నాయని కోర్టుకు ఈడీ స్పష్టం చేసింది. దాదాపు 200 కోట్లకు పైగా అక్రమాస్థులు ఉండ గా.. మరో 800 కోట్లు బినామీ పేర్లతో ఉన్నాయ ని అడిషనల్ సొసిలిటర్ జనరల్ కేఎం నటరాజ్ చెప్పారు. ఆస్థులకు సంబంధించి అనేక డాక్యుమెంట్లను ఈడీ సేకరించిందని పేర్కొన్నారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ సమాధానాలను శివకుమార్ దాటవేస్తున్నారని వివరించారు. దీనిపై జడ్జి మాట్లాడుతూ ‘మరో ఐదు కస్టడీలో సైతం అడిగిన ప్రశ్నలకు శివకుమార్ సరైన సమాధానం ఇస్తారని నేను అనుకోవడం లేదు.. మళ్లీ ఎందుకు ఐదు రోజుల కస్టడీ’ అని ఈడీని ప్రశ్నించారు. దీనికి మరికొంత మంది నిందితు ల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈయ న్ను ప్రశ్నించాలని అనుకొంటున్నామని ఈడీ సమాధానం ఇవ్వగా కస్టడీని మరో ఐదు రోజు లు పొడిగించేందుకు అంగీకరించింది. కాగా, శివకుమార్ ఆస్తుల్లో చాలావరకు ఆయన కు మార్తె ఐశ్వర్య పేరున ఉన్నాయి. ఈమెను సైతం ఈడీ గురువారం ప్రశ్నించింది. మనీలాండలిం గ్ చట్టం కింద ఈమెను విచారించినట్లు పే ర్కొంది. ఇంజనీరింగ్ తదితర కళాశాలలన్నీ ఈమె పేరుమీదే ఉన్నాయని స్పష్టం చేసింది. రూ.కోట్ల ఆస్తులతో ఉన్న ట్రస్టు సైతం ఈమె పే రు మీద ఉందన్నారు. కనకపుర ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న శివకుమార్‌ను సెప్టెంబర్ మూడో తేదీ వరకు నాలుగుసార్లు ఈడీ ప్రశ్నించింది.