క్రైమ్/లీగల్

నిమజ్జనం ప్రశాంతం.. అందరికీ కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం కొనసాగింది. ప్రతి ఒక్కరి కృషి ఫలితమే ఉత్సవ వేడుకలు విజయవంతంగా చిన్నపాటి ఘర్షణ కూడా లేకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం కొనసాగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల పాటు కొనసాగిన వినాయక నవరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లు సత్ఫాలితాలిచ్చాయన్నారు. మంటప నిర్వాహకులకు నిమజ్జనంకు సంబంధించి పోలీసులు తగిన సూచనలు చేయడం, నిర్వాహకుల సూచనల మేరకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు ఎంతో ఉపకరించాయన్నారు. అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. నిమజ్జనం కార్యక్రమాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్‌లలో ప్రత్యేక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిమజ్జనం ఊరేగింపును అధికారులు పరిశీలించారు. నగర వ్యాప్తంగా నిర్వహించే నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామని వెల్లడించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ను కలపుకొని మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 35 వేల మంది పోలీసులతో పాటు ఆర్‌ఎఎఫ్ బలగాలను బందోబస్తు విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన వినాయక నిమజ్జన ప్రధాన ఊరేగింపు కార్యక్రమంపై సీసీటీవీల పర్యవేక్షణలో ప్రతి పోలీస్ స్టేషన్‌తో పాటు మూడు కమిషనరేట్లు, డీజీపీ కార్యాలయంలో పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించినట్లు డీజీపీ వివరించారు. హైదరాబాద్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సీసీటీవీల ద్వారా నిశితంగా పరిశీలించామనీ.. ఈ క్రమంలో డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసు అధికారులు వీక్షించినట్లు తెలిపారు.
ట్యాంక్‌బండ్‌తో పాటు కాప్రా, సరూర్‌నగర్, అమీన్‌పూర్ చెరువులో 20 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన్నట్లు డీజీపీ తెలిపారు. వినాయక విగ్రహలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికారులకు వీలు కలిగిందన్నారు.