క్రైమ్/లీగల్

బీహార్‌లో మరో నిర్భయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెట్టిహ (బీహార్) : బీహార్‌లో ఘోరం జరిగింది. నడుస్తున్న వాహనంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. నలుగురు వ్యక్తు లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ అత్యాచార వార్త దావానంలా వ్యాపించడంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. ముజఫర్‌పూర్‌లోని ఓ పునరావాస కేంద్రంలో ఉండి ఆ తర్వాత విరమించుకున్న ఓ మహిళ తమకు ఫిర్యాదు చేశారని బెట్టిహ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శశి భూషణ్ ఠాకూర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నడుచుకుంటూ వెళుతుండగా, ఓ కారులో వచ్చిన వ్యక్తులు తనను బలవంతంగా ఎక్కించుకుని నడుస్తున్న వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని, డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. అయితే బాధిత మహిళ ఆరోపించినట్లుగా అత్యాచారం జరిగిందా?, లేదా అనేది నివేదిక రావాల్సి ఉందన్నారు. అత్యాచారం చేసిన అనంతరం తాను నివసిస్తున్న ప్రాంతం లో వదిలేసి వాహనంలో పారిపోయినట్లు ఆమె ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ముఖాలకు మాస్కులు ధరించినా, వాటిని తొలగించానని, వారిని గుర్తిస్తానని బాధిత మహిళ చెప్పినట్లు ఆయన తెలిపారు. పైగా తనపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని, వారిలో ఇద్దరు అన్నదమ్ముల్లా ఉన్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.