క్రైమ్/లీగల్

ఆ బెంచ్ నుంచి తప్పుకుంటున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కర్నాటక అనర్హత ఎమ్మెల్యే కేసు విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం నుంచి న్యాయమూర్తి ఎంఎం శంతన్‌గౌడ్ మంగళవారం వైదొలిగారు. అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమారు 17 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు వేశారు. దీంతో వారందరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించాల్సి ఉంది. ముగ్గురు న్యాయమూర్తుల్లో శాంతన్‌గౌడ్ ఒకరు. మంగళవారం పిటిషన్ విచారణ సందర్భంగా బెంచ్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో కేసు తదుపరి విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. 17 మంది అనర్హత ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను కోర్టు గతంలోనే తిరస్కరించింది. దానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై 17 మంది శాసన సభ్యులు తిరుగుబాటు చేశారు. తరువాత అసెంబ్లీ బలపరీక్షలో కుమారస్వామి ఓడిపోవడంతో బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్‌కుమార్ అనర్హత వేటు వేశారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా స్పీకర్ అనర్హత వేటు వేయడంతో 17 మంది ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ నిర్ణయాన్ని అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసే ముందు తమను అనర్హులుగా ప్రకటించారని, అది చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు వ్యతిరేకంగా స్పీకర్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని అనర్హత ఎమ్మెల్యేలు ఆరోపించారు. శాసన సభ సభ్వత్వాలకు తాము చేసిన రాజీనామాలు పెండింగ్‌లో ఉంచి మరీ తమపై అనర్హత వేటు వేశారని వారు వాపోయారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి శాంతన్‌గౌడ్ కర్నాటకు చెందిన వ్యక్తి కావడం వల్లే తప్పుకున్నట్టు భావిస్తున్నారు.