క్రైమ్/లీగల్

లైంగిక వేధింపుల కేసులో మూర్తికి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: లైంగిక వేధింపుల కేసులో ఏంజెన్ ఇనె్వస్టర్ మహేష్ మూర్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2004లో జరిగినట్టు చెబుతున్న కేసును న్యాయమూర్తులు రంజిత్ మోరే, ఎన్‌జే జమాదర్‌తో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. నిందిడుడు ఏంజెల్ ఇనె్వస్టర్ మహేష్ మూర్తికి కోర్టు విముక్తి కల్పించింది. 2004లో సంఘటన జరిగితే కేసు నమోదుకు అంత జాప్యం ఎందుకు జరిగిందని బెంచ్ ప్రశ్నించింది. బాధితురాలు 14 ఏళ్ల క్రితం తనపై లైంగిక దాడి జరిగిందని చెబుతూ 2018 మార్చిలో సబర్బన్ బంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. ఫిర్యాదులో విపరీతమైన జాప్యం అలాగే ‘సరిగా వివరించలేదు’ అన్న కారణాలతో ధర్మాసనం తిరస్కరించింది. బాధితురాలు ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు పెట్టింది. 2004లో ఓ కాఫీ షాప్‌లో మూర్తి తన పట్ల అనుచితంగా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు. తన శరీరాన్ని తాకుతూ అనుమతి లేకుండా ముద్దుపెట్టుకున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనపై మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన చార్జిషీట్‌ను సవాల్ చేస్తూ గత నెలలో మూర్తి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని, తనపై నమోదైన సెక్షన్లు చెల్లవని మూర్తి వాదించారు. పైగా కాలవ్యవధిలోనే ఆ సెక్షన్లు పనిచేస్తాయని, వాటి పరిమిత మూడు నెలలేనని ఆయన అన్నారు. వాదోవ ప్రతివాదను విన్న హైకోర్టు మూర్తిని నిర్దోషిగా ప్రకటించింది.