క్రైమ్/లీగల్

కన్హయ కేసు విచారణకు అనుమతి కోరిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ హోమ్‌శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం కేసు విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మనీష్ ఖురానాను పోలీసులు అభ్యర్థించారు. జేఎన్‌యూ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, తదితరులపై దాఖలైన కేసు పెండింగ్‌లో ఉంది. ఆ కేసు విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కుమార్, తదితరులపై జనవరి 14న చార్జిషీట్ దాఖలైంది. కన్హయ్యకుమార్‌తో పాటు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యపై అభియోగాలు నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి 9న జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించి జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ముగ్గురు విద్యార్థి నాయకులను విచారించేందుకు సంబంధిత అధికారులను కలిసి అనుమతి తీసుకోవాలని పోలీసులకు కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. తాజాగా కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందోన్న ఉత్కంఠత నెలకొంది.