క్రైమ్/లీగల్

రాజీవ్ కుమార్ కోసం సీబీఐ గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 19: ఎన్ని సార్లు సమన్లు పంపినా విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న పశ్చిమ బెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ కోసం సీబీఐ విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది. శారద ఫోంజి కుంభకోణంలో కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టాలన్న ఆరోపణలపై రాజీవ్‌కుమార్‌కు సీబీఐ సమన్లు పంపింది. ఆయన విచారణకు రాకపోవడంతో నగరమంతా గాలించడంతో పాటు శుక్రవారం ఉదయం 11 గం.ల కల్లా తమ ముం దు హాజరు కావాలని ఆదేశించింది. రాజీవ్‌కుమార్ కోసం సీబీఐ అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ల మెస్‌లను ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లోనూ గాలించారు. ఆయన ఆచూకీ లభించకపోవడంతో అరెస్ట్ వారెంట్‌కు అనుమతి ఇవ్వాలంటూ నగర కోర్టును ఆశ్రయించారు. కుమార్‌ను పట్టుకోవడంలో సహకరించాలని కోరుతూ రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శులకు లేఖ లు పంపారు. అయితే ఈ నెల 9 నుంచి రాజీవ్‌కుమార్ సెలవుపై ఉన్నారని, 25 వరకు ఆయన సెలవు ఉంటుందని సీబీఐ అధికారులకు డీజీపీ వివరించారు.