క్రైమ్/లీగల్

డీసీఎం, కారు ఢీకొని నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరుప్పుల : అదుపుతప్పిన వేగం డ్రైవర్ సహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమ కొడుకును లండన్‌కు పంపించేందుకు హైదరాబాద్ వెళ్లి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా పొంచిఉన్న ప్రమాదం వారి ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ సంఘటన గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చోటుచేసుకుంది. డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌కు చెందిన పెనుగింటి సాయిశరత్‌ను లండన్ పంపించేందుకు అతని తల్లిదండ్రులు పెనుగొండ సదాశివుడు, సుకన్య, వారి కుమార్తె మంజూషతో పాటు చిన్నాయన పెనుగొండ గణేష్, శ్రీలత బుధవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయానికి రెండు కార్లలో వెళ్ళారు. సాయిశరత్‌ను గురువారం తెల్లవారుజామున లండన్ వెళ్లే విమానం ఎక్కించి వారు తమ కారులో తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో జనగామ మీదుగా మహబూబాబాద్‌కు వెళ్తుండగా దేవరుప్పుల మండల పోలీసుస్టేషన్ వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న డీసీఎం కారును ఢీ కొట్టారు. ఈ సంఘటనలో సాయశరత్ చిన్నాన్న పెనుగొండ గణేష్, తల్లి పెనుగొండ సుకన్య, కారు డ్రైవర్ నజీర్ చనిపోయారు. తీవ్రగాయాలైన శ్రీలత, మంజూషాలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా చిన్నమ్మ శ్రీలత కూడా మృతిచెందింది. మంజూషాను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అయతే జనగామ వరకు వీరితో పాటు వచ్చిన శరత్ తండ్రి సదాశివుడు వేరే కారులోకి మారి హన్మకొండ వైపు వెళ్లడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్‌నాయక్, ఎస్సై రామారావు తెలిపారు.
*చిత్రాలు.. నుజ్జునుజ్జయిన వాహనాలు
*ప్రమాదంలో మృతి చెందిన వారు (ఇన్‌సెట్‌లో)