క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, సెప్టెంబర్ 21: రాజీవ్ గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు దండుకున్న ఉద్యోగి ఉదంతం వెలుగు చూసింది.
విశ్వవిద్యాలయ అధికారులు ఒక కమిటీ ఏర్పాటు చేసి, సదరు ఉద్యోగిపై విచారణ జరిపించిన అనంతరం శనివారం సాయంత్రం విధుల నుండి తొలగించారు. వెంటనే క్యాంపస్‌లో క్వార్టరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. గంగవల్లి శ్యామ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీ్ధర్ తనకు సమీప బంధువని, స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ట్రిపుల్ ఐటీలో ప్రచారం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ కోటగిరి శ్రీ్ధర్, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుతో కలసి దిగిన ఫొటోలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకున్నాడు. ట్రిపుల్ ఐటీకి సంబంధించి ముఖ్యమైన సమావేశాల్లో తానుకూడా పాల్గొంటానని, తనద్వారా ట్రిపుల్ ఐటీలో ఏ పనులైనా జరుగుతాయని పలువురిని నమ్మించాడు. ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న పలువురికి మెంటార్లుగా, ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇప్పించానని నమ్మబలికాడు. ట్రిపుల్ ఐటీలో హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఆఫీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్యామ్ నమ్మించటంతో పలువురు ఆయన వలలో పడ్డారు. సుమారు 50మందికి పైగా ఉద్యోగాల కోసం శ్యామ్‌ను ఆశ్రయించారు. ఒక్కొక్కరి వద్ద 50వేల రూపాయల నుండి 5లక్షల వరకు బేరం కుదుర్చుకుని, ముందస్తుగా కొంత సొమ్ము తీసుకున్నాడు.
ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో ఇద్దరు బాధితులు ట్రిపుల్ ఐటీ అధికారులకు, విశ్వవిద్యాలయం కులపతి కేసీ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం బయటకు పొక్కితే ట్రిపుల్ ఐటీ పరువుపోతుందని భావించిన అధికారులు ఒక కమిటీని ఏర్పాటు చేసి రహస్యంగా విచారణ జరిపారు. శ్యామ్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని కమిటీ తేల్చటంతో విధుల నుండి తొలగిస్తూ, వెంటనే క్యాంపస్ విడిచి వెళ్లాలని శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డీ సూర్యచంద్రరావు ‘్భమి’తో మాట్లాడుతూ పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్యామ్ మోసగించిన మాట వాస్తవమేనని తెలిపారు. ప్రత్యేక కమిటీతో విచారణ చేయించిన అనంతరం చర్యలు తీసుకున్నామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెపితే నమ్మవద్దని నిరుద్యోగులకు ఆయన సూచించారు.
*చిత్రాలు.. ముఖ్యమంత్రి జగన్‌తో, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీ్ధర్‌తో, నూజివీడు ఎమ్మెల్యే మేకా
ప్రతాప అప్పారావుతో ట్రిపుల్ ఐటీ ఉద్యోగి శ్యామ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు