క్రైమ్/లీగల్

పోలీస్..అటెన్షన్..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, ఫిబ్రవరి 11: మొదట చిల్లర దొంగల పనిలే అని అనుకున్నారు..తెల్లారే సరికి మరొక దొంగతనం జరగటంతో పోలీసులు దృష్టి సారించారు... ఇంతలోనే సరిగ్గా వారం రోజులకి మండల కేంద్రంలో దొంగలు మరొక పెద్ద దొంగతనానికే పాల్పడ్డారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా వరుసగా దొంగతనాలు జరగటంతో పోలీసులు తమ తడాఖా రుచి చూపించేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేసి అమలు చేస్తున్నారు...వివరాలను పరిశీలిస్తే మండల పరిధిలోని కొమ్ముగూడెంలోని పెద్దమ్మతల్లి ఆలయం, జూలూరుపాడులోని కోట మైసమ్మతల్లి ఆలయాల్లో గత నెల 16న దొంగలు చోరీకి పాల్పడ్డారు. 17న గుండెపుడిలో కిరాణం దుకాణం నడుపుకుంటున్న గాదె లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసును తెంపుకుని పారిపోవటంతో దొంగతనాలపై పోలీసులు దృష్టి సారించారు. వారం వ్యవధిలోనే 25వ తేదీన మండల కేంద్రంలోని జూలూరుపాడులో ఎంపిటిసి సాయిల నాగేశ్వరరావు ఇంట్లో అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడి రూ 70వేలు నగదు, వెంగన్నపాలెంలో బానోతు బాలు ఇంట్లో నిద్రిస్తున్న ఆయన భార్య లక్ష్మి మెడలోని సుమారు రూ 80వేలు విలువ చేసే బంగారు నగలు, రూ 25వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనతో దొంగతనాల వ్యవహారాన్ని పోలీసుశాఖ మరింత సీరియస్‌గా తీసుకుంది. తనదైన శైలిలో చర్యలను ముమ్మరం చేసింది. అయితే వరుసగా జరిగిన దొంగతనాలు మండల ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించిన విషయాన్ని సైతం ఆశాఖ పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జూలూరుపాడు సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాయల వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఎస్సై ఇళ్లా రాజేష్, సిబ్బందితో నిఘాను విస్తృతం చేశారు. దొంగతనాలు జరిగిన తీరు, అనుమానిత వ్యక్తులపై దృష్టి సారించారు. స్వయంగా సిఐతోపాటు ఎస్సై రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. మండలంలో సంచరించే అనుమానిత వ్యక్తులతోపాటు, గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న మద్యం బెల్టు షాపులపై కూడా దృష్టి సారించినట్లు తెలిసింది. మసక చీకటి పడిందంటే చాలు ద్విచక్ర వాహనాలతో పోలీసులు తెల్లారిందాక గస్తీని ముమ్మరం చేశారు. ఇంతే కాకుండా వాహనాల తనిఖీలను కూడా పోలీసులు విస్తుృతంగా నిర్వహిస్తున్నారు. దొంగతనాలు, అసాంఘీక శక్తులను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కఠినంగా వ్యవహరించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.