క్రైమ్/లీగల్

నకిలీ డాక్యుమెంట్లతో రూ. 4 లక్షలకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 6: కేంద్ర మంత్రి బంధువునని చెప్పి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ) నుంచి నాలుగు లక్షల రూపాయిలు కొట్టేసిన ప్రబుద్ధుడిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సునీత్ రత్న ప్రీతం అథవాలె (35) ఎంహెచ్‌ఏడీఏ నిర్మించిన ఇళ్లలో ఒకదానిని పొందడం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకొన్నాడు. బొరివాలిలోని షింపోలిలో ఇంటి కోసం ఎంహెచ్‌ఏడీఏ చైర్మన్ సంతకాన్ని పోర్జరీ చేసి అలాట్‌మెంట్ పొందాడు. హకీం సలీం షా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అలాట్‌మెంట్ మేరకు విచారణకు వెళ్లిన ఎంహెచ్‌ఏడీఏ సిబ్బందికి అక్కడ వేరే వ్యక్తులు నివాసం ఉండడంతో అసలు రంగు బయటపడింది. సలీం షా ఎంహెచ్‌ఏడీఏలోని తన మిత్రునికి నిందితుడు అథవాలె సంగతిని చెప్పాడు. ఈమేరకు అథవాలెపై వకోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌లో అథవాలెను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.