క్రైమ్/లీగల్

పీఎంసీ బ్యాంకు మాజీ చైర్మన్‌కు 9వరకు పోలీస్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 6: పంజాబ్, మహారాష్ట్ర కోపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణంలో ముంబయి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు మరింత ప్రగతిని సాధించారు. నాలుగువేల 355 కోట్ల కుంభకోణంలో బ్యాంకు మాజీ చైర్మన్ వర్యాం సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు స్థానిక కోర్టు సింగ్‌కు ఈనెల తొమ్మిదో తేదీ వరకు పోలీసు కస్టడీలో రిమాండ్‌కు తరలించారు. ఈ కుంభకోణంలో అరెస్టయిన వారిలో సింగ్ నాలుగో వ్యక్తి. సింగ్‌ను శనివారం మహిం చర్చి ఏరియాలో అరెస్టు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్‌ను ఈవోడబ్ల్యూ పోలీసు విభాగంగా ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) ప్రమోటర్లు రాకేష్, సారంగ్ వాద్వాన్‌లు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ మాత్రమే బాధ్యులనీ.. హెచ్‌డిఐఎల్ రుణాల మంజూరులో తన క్లయింట్ వర్యాం సింగ్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన లాయర్ కోర్టుకు వివరించారు. ముంబయి బందూప్ బ్రాంచ్ నుంచి రుణాలు స్వీకరించడంలో బ్యాంకు యాజమాన్యం హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లతో కుమ్మక్కయినట్లు ముంబయి ఆర్థిక నేరాల విభాగం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.